Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని జోడీ కట్టేందుకు శ్రుతి హాసన్ రెడీ!

Sruthi Haasan Special
Advertisement
  • వరుస హిట్లతో దూసుకుపోతున్న శ్రుతి హాసన్
  • ముగింపు దశలో ఉన్న 'సలార్' సినిమా  
  • నాని 30వ సినిమాలోను ఛాన్స్ 
  • భారీగానే పారితోషికం తీసుకున్నట్టు టాక్
Advertisement
శ్రుతిహాసన్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. తమిళ ... హిందీ భాషల్లో కంటే తెలుగులో ఆమెకి ఎక్కువ హిట్లు ఉన్నాయి. ఆ మధ్య బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ట్రై చేసిందిగానీ, ప్రయోజనం కనిపించలేదు. దాంతో ఆమె మళ్లీ టాలీవుడ్ దిశగా పరిగెత్తుకురాక తప్పలేదు. అయితే అదృష్టం కొద్దీ మళ్లీ ఆమెను సక్సెస్ లే పలకరించాయి.  

చాలా తక్కువ సమయంలో ఆమె ఇక్కడి నుంచి ' క్రాక్' .. 'వీరసింహా రెడ్డి' .. 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఆమె చేతిలో 'సలార్' వంటి పాన్ ఇండియా సినిమా ఉంది. ప్రభాస్ సరసన నాయికగా ఆమె నటిస్తున్న ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. 

ఇక ఈ సినిమా తరువాత ఆమె నాని సరసన నాయికగా చేయడానికి అంగీకరించిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. నాని తన 30వ సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ ను తీసుకున్నట్టుగా సమాచారం. ఇందుకోసం ఆమెకి భారీగానే పారితోషికం ముట్టిందని అంటున్నారు. మొత్తానికి శ్రుతి హాసన్ జోరు కొనసాగుతోందనే చెప్పాలి.

Advertisement
Advertisement
Sruthi Haasan
Actress
Tollywood

More Telugu News